AP: రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లోని పది నుంచి పన్నెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీల మధ్య తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశాలున్నాయని, వారు వైసీపీలో చేరవచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.