AP: జగన్ బాగుంటే జనం బాగుంటారని తాపత్రయపడే వాళ్లు వైసీపీ కార్యకర్తలని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లా పామర్రలో ఆయన మాట్లాడుతూ.. ‘కత్తులతో కొట్టుకోవడానికి మనం టీడీపీ, జనసేన కాదు. మనం వాళ్లు ఎవరినైనా భుజం మీద ఎత్తి మోస్తారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నాం. మనకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సీట్లు లేక టీడీపీ వాళ్లు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. వైసీపీ వాళ్లు ధైర్యంగా తిరుగుతున్నారు’ అని అన్నారు.