నెల్లూరు మేయర్‌ పీఠంపై టీడీపీలో ఆధిపత్య పోరు

AP: నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల వేడి మొదలవకముందే అధికార టీడీపీలో మేయర్‌ పీఠం కోసం అంతర్గత పోరు తీవ్రమైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే అభ్యర్థిత్వంపై నేతలు తమ వర్గాల బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేయర్‌ పీఠం తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఎవరికి వారు అభ్యర్థిత్వాలపై ప్రతిపాదనలను తెరపైకి తీసుకొస్తున్నారు. మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వర్గం నుంచి డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌యాదవ్‌ పేరు ప్రచారంలో ఉండగా, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన వర్గం నుంచి ప్రత్యామ్నాయ పేర్లను తెరపైకి తీసుకురావడం ఆసక్తి రేపుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕