AP: TDPలో మంత్రి నారా లోకేష్ ప్రాధాన్యత పెరుగుతోంది. యువగళం పాదయాత్రతో తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్న లోకేష్, ఇప్పుడు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మరింతగా జనంతో మమేకం కావాలని పార్టీ భావిస్తోంది. 2029 ఎన్నికల నేపథ్యంలో లోకేష్‌ను రాష్ట్రంలో మాస్ లీడర్‌గా నిలబెట్టేందుకు, చంద్రబాబు తర్వాత రాష్ట్ర భవిష్యత్తుకు నాయకుడిగా ప్రజల ఆమోదం పొందేలా భారీ కార్యక్రమాలను పార్టీ రూపొందిస్తోంది. ఆయనపై పూర్తి ఫోకస్ ఉండేలా TDPపధక రచన చేస్తోంది.