AP: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఏడుగురు నాయకులపై టీడీపీ వేటు వేసింది. కూటమి పొత్తు ధర్మాన్ని పాటించకుండా, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రెబల్స్‌గా బరిలోకి దిగి ప్రచారం చేస్తున్న కారణంగా వారిని సస్పెండ్ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సస్పెండైన వ్యక్తులతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరియు ప్రజలు గమనించాలని టీడీపీ స్పష్టం చేసింది.