ఏపీ శాసనమండలిలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై స్వతంత్ర ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హెరిటేజ్ ప్రస్తావన తీశారు. తిరుమల లడ్డూ కల్తీతో హెరిటేజ్‌కి ఏమాత్రం సంబంధం లేదని మంత్రి అచ్చెన్నవివరించారు. ఆధారాలు లేకుండా ఆరోపణ చేయడం కరెక్ట్ కాదని నిలదీశారు. దాంతో లడ్డూ కల్తీ అంశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.