AP: చీరాల పురపాలక సంఘాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎరిచర్ల హనీ స్పందన 6,408 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు, రాష్ట్రంలో గురువారం జరిగిన ఎన్నికల్లో 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలవారీగా జడ్పీటీసీల్లో కడపలో 23, పల్నాడులో 18 స్థానాలు ఏకగ్రీవం కాగా, ఎంపీటీసీల్లో పల్నాడులో 382, కడపలో 350 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.