ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ ఇందులో ఎక్కువ సీట్లు గెలిచింది. ఈసారి చాలామంది కొత్తవారికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. అలాంటి వారిలో ఎమ్మెల్యే శిరీష ఒకరు. ఈ టీడీపీ ఎమ్మెల్యే శిరీష మంచి మనసు చాటుకున్నారు. తన నియోజకవర్గ ప్రజల కష్టాలను తీర్చేందుకు రంగం సిద్ధం చేశారు. తన సొంత డబ్బులతో ఓ అంబులెన్స్ కూడా రెడీ చేశారు. ఈ వాహనాన్ని ఆగస్టు 9వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు.