టీడీపీ కార్యకర్తలపై కర్రలతో దాడి (వీడియో)

AP: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం లంకెలకూరపాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ గొడవ జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕