AP: జనసేన ఎమ్మెల్యేను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. యలమంచిలి మండలం జంపపాలెంలో శ్రీరామ నవమి వేడుకకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వచ్చారు. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన నాయకుడు యల్లపు సతీష్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే రావడంతో వివాదం మొదలైంది. గతంలో తాము ఎన్నిసార్లు పిలిచినా ఎమ్మెల్యే రాలేదని.. ఇప్పుడు ఎలా వస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. జనసేన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.