AP: పులివెందుల పరిషత్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. అక్కడ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారతి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థిపై 1463 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అభ్యర్థి భారతి విజయంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.