హిందీ భాషపై వివాదం నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. "హిందీ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ ఈ కాలం పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం మరింత అవసరం" అని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు విస్తరిస్తున్న తరుణంలో విద్యా వ్యవస్థను ఇంగ్లీష్ మీడియంగా మార్చడం ద్వారా కొత్త మార్పుకు నాంది పలుకుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇంగ్లీష్ అనేది ముఖ్యమని జగన్ అభిప్రాయపడ్డారు.