ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. రన్‌వేపై నిలిచిపోయిన ఫ్లైట్

విశాఖపట్నం నుంచి తిరుపతికి బయలుదేరిన ఇండిగో విమానం (6E7063)లో టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్లు విమానాన్ని రన్‌వేపైనే నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏసీ కూడా ఆగిపోవడంతో ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. ఆలస్యం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విశాఖ విమానాశ్రయంలో గందరగోళ వాతావరణం నెలకొంది. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు ఇంజనీర్ల బృందం పనిచేస్తోంది. ప్రయాణికులు త్వరగా గమ్యస్థానాలకు చేరాలని ఆశిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్