తెలంగాణ అభివృద్ధిని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను 'అన్‌స్టాపబుల్' అని అన్నారని, తాను 'అన్‌బీటబుల్' అని అంటున్నానని తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా ఏటా 8-9 శాతం వృద్ధి సాధించడం చాలెంజింగ్ అయినా సాధ్యమేనని అన్నారు. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో అభివృద్ధి సాధించిందని, తయారీ, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.