APలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ భయంతో పారిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన మీడియా ఎదుట క్లారిటీ ఇచ్చారు. "నేను ఎక్కడికీ పారిపోలేదు. ఫోన్లు స్విచ్ ఆన్‌లోనే ఉన్నాయి. పిల్లల అవసరాల కోసం చెన్నైకి వెళ్లాను. నాకూ కొన్ని పనులు ఉంటాయి. ఎప్పుడు అరెస్టు చేయాలనుకుంటున్నారో ముందే చెప్తే, అప్పుడు అందుబాటులో ఉంటా. దేనికైనా సిద్ధంగా ఉన్నా” అని ఆయన చెప్పారు.