AP: పంచాయతీ ఉద్యోగుల జీతాల పెంపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఉద్యోగుల జీతాలు పెరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి. సంపద పెంచిన తర్వాతే ఏదైనా చేయగలం. పని చేయకుండా, అభివృద్ధి చేయకుండా సంపద ఎలా పెరుగుతుంది' అని అన్నారు. రాజకీయ వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.