కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మున్సిపల్ ఛైర్మన్ ఇంటికి వెళ్లడంతో టీడీపీ కార్యకర్తలు అతడిని అడ్డుకున్నారు. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికలో భాగంగా రాజా మున్సిపల్ ఛైర్మన్ ఇంటికి వెళ్లడంపై టీడీపీ కార్యాకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కార్యాకర్తల మధ్య గొడవ చెలరేగడంతో చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.