AP: నంద్యాల జిల్లా నందికొట్కూరు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. తొలి రౌండ్‌లో వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే 23 వార్డుల్లో వైసీపీ గెలిచింది. టీడీపీ 9 వార్డుల్లో గెలిచింది. దాంతో కౌంటింగ్‌లో మోసం జరుగుతుందని టీడీపీ ఆరోపిస్తోంది. రీకౌంటింగ్ చేయాలని టీడీపీ ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు.