కడపలో నామినేషన్ కేంద్రాల వ‌ద్ద‌ ఉద్రిక్తత

AP: కడపలోని గాంధీనగర్ స్కూల్ వద్ద ఉన్న నామినేషన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి అల్లుడు లోమడ మనోజ్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఘర్షణలో వైసీపీ శ్రేణులపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి మరియు మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా చోటుచేసుకున్న ఈ అల్లర్లు స్థానికంగా ఆందోళన రేకెత్తించాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕