AP: యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్న రావణ్‌ను కోర్టుకు తరలించే సమయంలో పిఠాపురం పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.