అనంతపురంలో రీపోలింగ్ వద్ద ఉద్రిక్తత (వీడియో)

AP: అనంతపురం నగరంలోని 30వ డివిజన్‌ 3వ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న(ఆదివారం) కూటమి నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల అధికారులు తిరిగి పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలింగ్‌ కేంద్రం వద్ద బీజేపీ నేతలు దౌర్జన్యానికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దొంగ ఓట్లు వేయడానికి, ఓటింగ్‌ సైక్లింగ్‌కు అనుమతించాలని బెదిరించినట్లు సమాచారం. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕