విజయవాడ విద్యా భవన్ వద్ద ఉద్రిక్తత (వీడియో)

AP: ఇన్ సర్వీస్ టీచర్లకు TET నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ విద్యా భవన్ ముట్టడికి UTF పిలుపునిచ్చింది. దాంతో ఉపాధ్యాయులు విజయవాడ విద్యా భవన్‌కు తరలివచ్చారు. అందరికీ ఒకే క్వాలిఫైయింగ్ మార్కులు ఉండాలని, బోధించే సబ్జెక్టులోనే ఆఫ్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. దాంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్