AP: నామినేషన్ల వేళ వైఎస్సార్ కడప జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల సమక్షంలోనే వైసీపీ అభ్యర్థులపై రాళ్ల దాడి జరిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. కొండాపురంలో నామినేషన్ వేయడానికి వెళ్తున్న వైసీపీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు జరిగినట్లు ఆరోపించారు. కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు మండిపడ్డారు.