బద్వేల్‌లో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే సుధా అరెస్ట్‌

AP: కడప జిల్లా బద్వేల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాను పోలీసులు అరెస్ట్‌ చేసి అట్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే పలువురు జిల్లా వైసీపీ నేతలను కూడా అట్లూరు పీఎస్‌కు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అరెస్టు వార్తతో బద్వేల్‌ నాలుగు రోడ్ల కూడలికి వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕