AP: నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న ప్రజావేదిక సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల ఓ ప్రైవేట్ స్కూల్‌లో తౌశిక్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన కుమారుడి మృతిపై దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు బాధిత తండ్రి ప్రయత్నించారు. సభా ప్రాంగణానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ వ్యక్తిని ఈడ్చుకుంటూ పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు.