AP: కృష్ణా జిల్లాలోని గుడివాడలో శనివారం హైటెన్సన్ నెలకొంది. వైసీపీ 'బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రామ్' నిర్వహించింది. మరోవైపు టీడీపీ కూడా 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు వైసీపీ నేత కొడాలి నాని ఫొటోలను చించేశారు. దీంతో వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ZP ఛైర్ పర్సన్ ఉప్పాల హరిక కారును ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.