AP: కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గంలోని గుండ్లకుంట పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే సమయంలో, ఎన్నికల సిబ్బందితో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి భార్య వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఘటనా స్థలంలో జరిగిన ఈ గొడవ వల్ల ఎన్నికల ప్రక్రియకు కొంత అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది.