AP: కృష్ణా జిల్లా మచిలీపట్నం హౌసింగ్ బోర్డ్ సెంటర్‌లో వాజ్‌పేయీ విగ్రహ స్థాపనపై ఉద్రిక్తత నెలకొంది. రికార్డుల ప్రకారం ఇది ఎన్టీఆర్ సర్కిల్‌గా ఉన్నప్పటికీ, బీజేపీ వాజ్‌పేయీ విగ్రహం పెట్టేందుకు ప్రయత్నించడంతో బీజేపీ–టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.