నంద్యాల జిల్లాలో ఉద్రిక్తత.. వైసీపీ ఏజెంట్లను అడ్డుకున్న పోలీసులు

AP: నంద్యాల జిల్లా, మండ్లెం పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిని నిరసిస్తూ వైసీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించారు. తమను అడ్డుకోవడంపై ఏజెంట్లు పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕