పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

AP: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం, లింగాల మండలంలోని పార్నపల్లెలో పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ బూత్‌లో ఏజెంట్ల విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో, అక్కడ పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రారంభం కాలేదు. వైసీపీ ఏజెంట్లను బూత్‌లోకి అనుమతించడం లేదని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, పార్నపల్లెకు వెళ్తుండగా ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నియోజకవర్గంలో ఈ ఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్

✕
✕