AP: అన్నమయ్య జిల్లా పుంగనూరులో జనసేన అభ్యర్థి నామినేషన్ పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి టీడీపీ శ్రేణులే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్తతను గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ వాహనాల ధ్వంసం, గొడవలు జరగడంతో అప్పట్లో ప్రత్యేక బలగాలను మోహరించాల్సి వచ్చింది.