టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

AP: టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్. పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ పొడిగించింది. ఫీజును ఫైన్ లేకుండా ఈ నెల 9 వరకు, రూ.50 ఫైన్‌తో 12 వరకు, రూ.200 ఫైన్‌తో 15 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. అలాగే రూ.500 ఫైన్‌తో ఫీజు చెల్లించే గడువును 18వ తేదీ వరకు పెంచింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ సూచించింది.

సంబంధిత పోస్ట్