AP: ఎస్ఎస్‌సీ బోర్డు టెన్త్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 4వ వారంలో విడుదల చేయడానికి చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 2తో పరీక్షలు ముగియనున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6 నుండి 15వ తేదీ వరకు జరుగుతుంది. అనంతరం ఓఎంఆర్ స్కానింగ్, ఆన్సర్ షీట్లలో తేడాలుంటే వెరిఫికేషన్, వాల్యుయేషన్ పత్రాల ర్యాండమ్ చెకప్, కంప్యూటరీకరణ ప్రక్రియలు పూర్తవుతాయి. ఇవన్నీ పూర్తయ్యాక ఏప్రిల్ 30లోపు ఫలితాలను ప్రకటిస్తామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.