నేటి నుంచి TET పరీక్షలు

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) బుధవారం నుంచి ఈ నెల 21 వరకు రోజూ రెండు విడతల్లో ఆన్‌లైన్‌లో జరగనుంది. మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 133 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం వరకు 96.25% మంది అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దరఖాస్తుల్లో తప్పులుంటే ఆధారాలు సమర్పించి సరిదిద్దుకునే అవకాశం కల్పించారు. స్క్రైబ్‌ అవసరమైన వారికి సహాయకులను కేటాయిస్తారు.

సంబంధిత పోస్ట్