AP: 21వ శతాబ్దం ప్రధాని మోదీదే అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపు సాధించిందని అన్నారు. 2001లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మోదీ, 2014లో దేశ ప్రధానిగా ఎన్నికై భారత్‌కు కొత్త దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వం వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ట మరింత పెరిగిందని చంద్రబాబు తెలిపారు.