దూసుకొస్తున్న మొంథా.. ఈదురుగాలులు (వీడియో)

AP: కాకినాడ తీరం వైపు మొంథా తుఫాన్ దూసుకొస్తోంది. సముద్ర తీరాల వద్ద రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. 100 మీటర్లకు పైగా సముద్రం ముందుకు చొచ్చుకుని వచ్చింది. తుఫాన్ ధాటికి తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. కృత్తివెన్ను, అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి, కోడూరు మండలాల్లో ఈదురుగాలుల తీవ్రత పెరిగింది. తుఫాన్ తీవ్రతకు తీవ్ర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తుఫాన్ ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్