దూసుకొస్తున్న అర్నాబ్ తుఫాన్

AP: అర్నాబ్ తుఫాన్ దూసుకొస్తోంది. ఇవాళ అర్ధరాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా, రేపు అతి తీవ్ర తుపాన్‌గా అర్నాబ్ బలపడనుందని APSDMA తెలిపింది. ఎల్లుండి ఉదయం బాపట్ల-విశాఖ మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం దాటే సమయంలో 115-125 కి.మీ, గరిష్ఠంగా 140 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్నిప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్

✕
✕