AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కల్తీ మద్యం కేసు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరువూరులో ప్రజా దర్బార్ అనంతరం ఆయన మాట్లాడుతూ, కల్తీ మద్యం కేసులో నిందితులను జైలుకు పంపించి, వారి ఆస్తులను జప్తు చేయాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే జోగి రమేశ్ కల్తీ మద్యం దందా నిర్వహించేవాడని, అతని బినామీలు అందరూ ఇప్పుడు కటకటాల్లోకి వెళ్తున్నారని తెలిపారు.