AP: వైసీపీ మహిళా నాయకురాలు ఉప్పాల హారికపై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈ ఘటనపై హోంమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. అరాచక శక్తులను అదుపు చేసే బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రోత్సాహంతోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఒక బీసీ మహిళా ప్రజా ప్రతినిధిపై దాడి చేయడానికి సిగ్గుపడాలన్నారు.