ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల నిధులను సమకూర్చింది. రైల్వే, రోడ్ల ప్రాజెక్టులతో పాటు 12 ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించిన నిర్మాణాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భవనాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఈ సమయంలో, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతికి తాను వ్యతిరేకమని ప్రకటించారు. జగన్ రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, అందుకే కేంద్రం ఆయన తీరుపై సీరియస్‌గా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.