AP: గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తరచూ విమర్శలు చేయడం ఆయనలో ఉన్న భయానికి నిదర్శనమని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదని, కేవలం రెండేళ్ల పాలనలోనే అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ఎంత త్వరగా అధికారాన్ని కోల్పోతే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని అన్నారు.