AP: కడప జిల్లా నాగులగుట్టపల్లిలో సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసిందని జనసేన పేర్కొంది. ఈ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారని వెల్లడించింది. క్షేత్రస్థాయిలో ఘటనకు గల కారణాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించినట్లు తెలిపింది. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పవన్ భరోసా ఇచ్చారని పేర్కొంది.