దేశమంతా ఏపీ వైపు చూస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్ అవార్డుల్లో ఏపీకి స్వర్ణాలు రావడంపై సోమవారం ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దిశానిర్దేశంతో అవార్డులు సాధించామన్నారు. రాష్ట్రంలో 7 జిల్లాలకు వివిధ విభాగాల్లో అవార్డులు వచ్చాయని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆగస్టు 7 చేనేత దినోత్సవం రోజున ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు.