ఎక్కడా క్లీన్‌చిట్ ఇవ్వలేదనేది వాస్తవం: పవన్

వైసీపీ పాలనలో అనేక ఘటనలు జరిగాయని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "సాధారణంగా వ్యక్తిగతంగా వర్గాలపై కక్షలుంటాయి. వైసీపీ వాళ్లు భగవంతుడిపైనా పగపెట్టుకున్నారు. ఏ నివేదికలోనూ క్లీన్‌చిట్ ఇవ్వలేదనేది వాస్తవం" అని వ్యాఖ్యానించారు. సున్నితమైన అంశాలపై ఆలోచించి మాట్లాడాలని, మాట్లాడే ముందు పర్యవసానాలను ఆలోచించి ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్