AP: వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూషకు బాధ్యతలు అప్పగించారు. రాజకీయ వారసురాలిగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమెకు భీమిలి బాధ్యతలు కీలక సవాల్‌గా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం తదితర ప్రాంతాల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం అనూష ముందున్న ప్రధాన బాధ్యతలు. నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలను ఎదుర్కొంటూ పార్టీకి కొత్త ఊపునివ్వడం ఆమెకు కీలక టాస్క్‌గా మారింది.