తడిసిన పొగాకు పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: గొట్టిపాటి

AP: మొంథా తుఫాన్ కారణంగా ఏపీలో చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే రైతులకు సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ మేరకు ఇవాళ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. బాపట్ల జిల్లా పర్చూరులో పర్యటించారు. ఈ సందర్భంగా నిల్వగా ఉంచిన పొగాకు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ.. తడిసిన పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్