AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ అంశంపై తాజాగా వెలువడిన సిట్ నివేదికను ఆధారంగా చేసుకుని తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు గురువారం మూడు పార్టీల అధినేతలు భేటీ కానున్నారు. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, రాష్ట్ర BJP అధ్యక్షుడు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సిట్ నివేదికపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు గట్టిగా సమాధానం ఇవ్వడం, ప్రజలకు వాస్తవాలు తెలియజేసేలా ఉమ్మడి మీడియా సమావేశాలు నిర్వహించడం వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.