సింహపురి రాజకీయాల్లో జనసేన వ్యూహం ఆసక్తికరంగా మారింది. పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నా, అధిష్టానం మాత్రం తొందరపడవద్దని సూచిస్తోంది. ఒంగోలులో బాలినేని, దామచర్ల ఎపిసోడ్ తర్వాత, ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకునే విషయంలో జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తోంది. బలోపేతం పేరుతో ఎవరిని పడితే వారిని తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన నేతలతో పాటు, టీడీపీలో అసంతృప్తిగా ఉన్నవారు కూడా జనసేనతో టచ్‌లోకి వెళ్తున్నారట.