AP: స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం అయింది. బీసీలకు 34% రిజర్వేషన్లపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. SIR పూర్తయ్యే వరకు ఎన్నికలు జరపరాదన్న వైసీపీ పిటిషన్ను కూడా తోసిపుచ్చింది. 6 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో, వారం, 10 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేసి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా ఎన్నికలు, ఫలితాల ప్రక్రియ పూర్తి కానుంది.