మావోయిస్టుల నెట్‌వర్క్ కూలిపోతోందని, గడ్చిరోలిలో 61 మంది మావోయిస్టుల లొంగుబాటు నక్సల్ నిర్మూలనలో కీలక మలుపు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ పరిణామం కేంద్రమంత్రి అమిత్ షా దృఢమైన వ్యూహానికి ప్రతిబింబమని, 2026 మార్చి నాటికి నక్సలిజం పూర్తి నిర్మూలన స్పష్టంగా అమలవుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం చెప్పిందే చేస్తోందని, 'అస్త్రాలు వదలండి. లొంగిపోండి' అని ఆయన ట్వీట్ చేశారు.